చైనా పర్యటనను రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

-

కేంద్ర, సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ముగ్గురు భారతీయ వుషు ఆటగాళ్లు నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా, మెపుంగ్ లాంగులకు చైనాలో ప్రవేశం నిరాకరించడంతో ఆ దేశ పర్యటనను అనురాగ్ ఠాకూర్ రద్దు చేసుకున్నట్లుగా కేంద్ర విదేశాగ శాఖ వెల్లడించింది. మన ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు భారత ప్రభుత్వానికి వుందని పేర్కొంది.


నివాస ప్రాతిపదికన భారతీయ పౌరుల పట్ల అవలంభించే భిన్నమైన వైఖరిని ఇండియా తిరస్కరిస్తుందని ఎంఈఏ స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులకు చైనా అక్రిడిటేషన్‌ను నిరాకరించడం సరికాదని విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా క్రీడల స్పూర్తిని, నియమాలను చైనా ఉల్లంఘిస్తోందని ఫైర్ అయింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు విమానంలో బయల్దేరింది. అయితే వీరిలో ముగ్గురికి చైనా అనుమతి నిరాకరిచడంతో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌కు భారత ఆటగాళ్లను అధికారులు తీసుకొచ్చారు. అయితే త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news