టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్ కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు : మంత్రి తుమ్మల

-

టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్ కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మార్కెటింగ్ మరియు గిడ్డంగుల సంస్థ గోదాములపైన సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఖమ్మం మార్కెట్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికరించేలా చర్యలకు ఆదేశించారు. కొహెడ పండ్ల మార్కెట్ నుండి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌళికసదుపాయాలతో అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బుగ్గపాడు మెగా టెక్స్ టైల్ పార్కులో వచ్చేనెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.  మంత్రి తుమ్మల
రాష్ట్రంలోని 475 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు ఆహారం, నీరు, విద్యుత్తు, నిర్వహణ ఛార్జీలు మొదలైన వాటి కోసం ఏప్రిల్ 2024 నెలలో రూ.9.49,49,159/- నిధుల విడుదల చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news