కాంగ్రెస్ లో చేరడం పై క్లారిటీ ఇచ్చిన ఈటల..!

-

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఈటల. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఈటల రాజేందర్. దీంతో  ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

త్వరలోనే ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఆయనకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైందని.. ఈసారి ఎలాగైనా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ కు గాలం వేస్తోందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో  హుజరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలలో పోటీ చేసిన ఈటల రాజేందర్ ఓడిపోయారు. 

బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. నేను కాంగ్రెస్ లో చేరడం లేదు. కాంగ్రెస్ నాపై దుష్ప్రచారం చేస్తోంది. లేదంటే పార్టీలో ఉన్నవారే నేను బీజేపీని వీడాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నాను అని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version