తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్. 5 వేలకు పైగా ఎకరాల అసైన్డ్ మెంట్ ల్యాండ్ పేదల నుంచి కేసీఆర్ లాక్కున్నారని ఆగ్రహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 లక్షల మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని… IDH కాలనీ లో వంద ఇళ్లు కట్టి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో షో చేశారని ఫైర్ అయ్యారు.
తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం కేంద్రం హడ్కో కింద 9 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్ కి లేదని ఫైర్ అయ్యారు. గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు అంటున్నారు…తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్ టైం మూడు నెలలు మాత్రమేనని..గృహలక్ష్మి పథకం కింద ఇప్పుడు ప్రొసీడింగ్స్ మాత్రమే ఇస్తారు… వచ్చే మన ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఏపీలో 20 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు.. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదని ఆగ్రహించారు ఈటల.