వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు

-

వాలంటీర్లపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్ కి.. వాలంటీర్లకు తేడా లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని విమర్శించారు.

వాలంటీర్ ఉద్యోగానికి పోలీసు వెరిఫికేషన్ చేయాలన్నారు. కొంతమంది వాలంటీర్ల నుంచి పిల్లలు, పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. చాలా చోట్ల వాలంటీర్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తమపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం తప్పు చేసిన వారిని మాత్రం వదిలేస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news