Etala Rajender counter to Professor Nageshwar Rao: ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు లాంటి సూడో మేధావులు రేవంత్ రెడ్డి ఏదో గొప్ప ప్రగతి కాముకుడు, ఆయనో మేధావి, ఆయనో సంస్కర్త, ఆయన మాత్రమే తెలంగాణను రక్షించగలడు అన్నంత బిల్డప్ ఇస్తున్నాడని ఆగ్రహించారు ఈటల.
నీకు N కన్వెన్షన్ ఒకటి మాత్రమే తెలుసేమో కానీ చాలా మంది పేదల ఇళ్లకు నోటీసులు ఇస్తున్నారని సెటైర్లు పేల్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అసలు విషయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.