వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు – రేవంత్‌ కు ఈటల కౌంటర్‌

-

వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడని రేవంత్‌ రెడ్డికి ఈటల కౌంటర్‌ ఇచ్చారు. నిన్న రేవంత్‌ రెడ్డి కంట తడి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఈటల స్పందించారు.సింగరేణి పై నేను మాట్లాడిన… నేను ఎవరి పైన వ్యక్తిగతంగా మాట్లడలేదని తెలిపారు. ఢిల్లీ కేంద్రం గా జాతీయ పార్టీ లు రాజకీయాలు చేస్తాయని అన్నానని.. బీజేపీని ఇరకాటం లో పెట్టేందుకు brs, కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకున్నాయని ఫైర్‌ అయ్యారు.

ఖర్గే, kk కలిసి మాట్లాడతారని.. రాహుల్ గాంధీ సూరత్ కోర్ట్ తీర్పు పై brs ఆయనకు మద్దతుగా మాట్లాడిందని నిప్పులు చెరిగారు. వీరుడు, దీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు…రేవంత్ రెడ్డి కన్నీరు పెడుతూ సంస్కార హీనంగా మాట్లాడారని ఆగ్రహించారు. నేను విద్యార్థి దశలోనే రెండు సార్లు జైలు కు వెళ్లానని.. మేము తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నావు…అని ప్రశ్నించారు. ఆ సమయంలో చంద్రబాబు పంచన చేరావని రేవంత్‌ పై ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. తుపాకీ పట్టుకొని వచ్చింది నువు… నాకు నీకు ఏమీ పోలిక రేవంత్ రెడ్డి అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news