దుబ్బాకలో ట్రైయాంగిల్..రఘునందన్‌కు మళ్ళీ కష్టమేనా?

-

తెలంగాణ రాజకీయాల్లో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి సంచలమైన ఉపఎన్నిక ఏదైనా ఉందంటే..అది దుబ్బాక అనే చెప్పాలి. అప్పటికే అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ హవా ఉంది..చనిపోయింది బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే..దీంతో బి‌ఆర్‌ఎస్ సులువుగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ దుబ్బాక ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు. బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో..దుబ్బాక ఉపఎన్నిక వచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో ఆయనే గెలిచారు.

ఆయన మరణంతో దుబ్బాక ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో బి‌ఆర్‌ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య నిలబడగా, బి‌జే‌పి నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. అసలు రఘునందన్ విజయంపై ఎవరికి నమ్మకం లేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేయడం..2014 , 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన సానుభూతి ఉండటం, అదే సమయంలో రాష్ట్రంలో బి‌జే‌పి బలపడుతూ ఉండటం..రఘునందన్‌కు కలిసొచ్చింది.

 

అయితే ఆఖరి రౌండ్ వరకు హోరాహోరీ జరిగిన పోరులో రఘునందన్ వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ ఓట్లు దారుణంగా పడిపోవడంతో రఘునందన్‌కు కలిసొచ్చింది. అలా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఉపఎన్నికలో గెలిచిన రఘునందన్..సాధారణ ఎన్నికల్లో గెలుస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. బి‌ఆర్‌ఎస్ బలం గానే ఉంది..అటు కాంగ్రెస్ రేసులోకి వస్తుంది. బి‌జే‌పి బలంగానే ఉంది గాని..మళ్ళీ దుబ్బాక ప్రజలు రఘునందన్‌ని ఆదరిస్తారో లేదో చూడాలి.

అక్కడ బి‌ఆర్‌ఎస్ తరుపున ఈ సారి సోలిపేట ఫ్యామిలీ నుంచి ఎవరిని బరిలో దింపుతారో క్లారిటీ లేదు..లేదా వేరే నాయకుడుని దించే ఛాన్స్ కూడా ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. బి‌జే‌పి నుంచి రఘు బరిలో ఉంటారు. మొత్తానికి ఈ సారి దుబ్బాక ట్రైయాంగిల్ ఫైట్ ఖాయమే. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news