కేసీఆర్ అనుమతి లేకుండా ఏ పని చేయలేని స్థితిలో మంత్రులున్నారు : ఈటల రాజేందర్

-

తాను నేను గజ్వేల్‌లో పోటీ చేస్తే హరీశ్ రావు ఉలిక్కి పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్‌ ప్రజల కష్టాలను సీఎం కేసీఆర్‌ తీర్చలేదని పేర్కొన్నారు. పదేళ్లు గడుస్తున్నా తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ అనుమతి లేనిదే మంత్రులు ఏ పని చేయలేరన్న ఈటల.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ వ్యక్తుల్లో ఒకరిని సీఎం చేస్తారా? అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో ప్రచారం నిర్వహించిన ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

“10 ఏళ్లలో డబుల్ బెడ్ రూం లు ఇవ్వకుండా గృహలక్ష్మి కింద 3 లక్షల కాగితాలు ఇస్తా అంటే ప్రజలు నమ్ముతారా? పదేళ్లు గడుస్తున్నా తెలంగాణల రేషన్ కార్డులు ఇవ్వలేని దద్దమ్మలు బీఆర్ఎస్ నేతలు అని ప్రజలే అంటున్నారు. స్వతహాగా పని చేయలేని స్థితిలో మంత్రి హరీశ్ రావ్ ఉన్నారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా అని కేసీఆర్ అన్నారు. అదే మేము అంటున్నాం కేసీఆర్ కు ఓటు వేస్తే ఏమి రాదని. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో మెరుగైన విద్యను అందిస్తాం.” అని ఈటల అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news