అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో హైడ్రా చేస్తున్నఅక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాతం మంది సమర్థిస్తుంటే.. కేవలం 22 శాతం మంది మాత్రమే తప్పు పట్టారని పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయమేనని అందువల్లనే తాను బీజేపీలో ఉన్నా మద్దతు ఇస్తున్నామన్నారు.
హైడ్రా కూల్చివేతల వెనుక సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ నే తొలుత కూల్చేవారని.. పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసిందన్నారు. హైడ్రా పనితీరుకు మద్దతు ఇస్తూనే మూడు లోపాలను, ఒక సవరణను గుర్తించాలని సూచించారు. బాధితులలో చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నందున వారికి పరిష్కార మార్గం కూడా హైడ్రానే చూపించాలన్నారు. దేవాలయ భూముల విషయంలో కూడా హైడ్రా ఇలాగే ని చేయాలని ప్రతిపాదించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.