రవీంద్ర భారతి లో నిర్వహించిన చాకలి ఐలమ్మ గారి 127వ జయంతి వేడుకలలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని.. ఇలా ఏ ప్రభుత్వమైనా ఇస్తుందా అని ప్రశ్నించారు. రోడ్డుమీద కుక్కలు వాగుతూనే ఉంటాయని గాటు వ్యాఖ్యలు చేశారు. రైతు బీమా, రైతుబంధు లాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వేల, వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కడు కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. వారు ఇక్కడ అధికారంలోకి వచ్చేది ఏం లేదని అన్నారు. ఇకనుంచి మేము కూడా మిమ్మల్ని తిడతామని హెచ్చరించారు. చాకలి ఐలమ్మ జయంతిని జరుపుకోవాలని మనందరికీ గర్వకారణం అని అన్నారు.