మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి కన్నుమూత.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

-

వికారాబాద్‌ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తండ్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి  శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. పరిగి నియోజకవర్గానికి ఆయన ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మరోవైపు హరీశ్వర్ రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్సీలను ఆదేశించారు.

పరిగి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి భౌతిక కాయానికి మంత్రి సబిత ఇంద్రారెడ్డి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హరీశ్వర్‌రెడ్డి మరణం బీఆర్ఎస్​కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version