HMDA మాజీ డైరెక్టర్ దగ్గర రూ.300-400 కోట్లు !

-

ACB అరెస్టు చేసిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. నానక్ రామ్ గూడలోని ఇంట్లో రూ. 85 లక్షల నగదు, హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూపత్రాలు సీజ్ చేశారు.

Ex-HMDA director Balakrishna’s house has huge assets

రెండు కిలోల బంగారం, 80 ఖరీదైన వాచీలు, 18 ఐఫోన్లు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాల భూములు బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ. 300-400 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.

కాగా, HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం రోజున ఏసీబీ నిర్వహించిన దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడటంతో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news