రేవంత్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం.. మాజీ మంత్రి సంచలనం

-

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, మరో 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పథకాల పేర్లు మార్చి ఎంతో అభివృద్ధి చేసినట్లు కాంగ్రెస్ గొప్పలు చెప్తుందని విమర్శించారు.

Ex-minister Errabelli Dayakar Rao has blasted a bomb saying that Revanth Reddy’s government is certain to collapse in Telangana

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని స్పష్టం చేశారు. రేవంత్.. సిగ్గుందా నీకు? అంటూ ఆగ్రహించారు. కాళోజి కళాక్షేత్రం కోసం కేటాయించిన స్థలం ఇది వరకు ఎవరి కబ్జాలో ఉన్నది? అంటూ ఫైర్‌ అయ్యారు.  మీ కాంగ్రెస్ నేతల కబ్జాలో ఉంటే పోరాడింది మేము..ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతావా? అంటూ నిప్పులు చెరిగారు ఎర్రబెల్లి.

Read more RELATED
Recommended to you

Exit mobile version