వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైసీపీలో కొత్త పోస్టులు… భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజాకు కీలక పదవులు కట్టబెట్టారు.
ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబు నువ్వు నియామకం చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియామకం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది వైసిపి పార్టీ. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పార్టీకి దూరం కావడంతో… జగన్మోహన్ రెడ్డి కొత్తగా వీళ్ళ ఇద్దరికీ బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తోంది.