వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసిపి పార్టీకి చెందిన బడా నేత వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం పూట వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో ఉన్న.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పకడ్బందీగా పట్టుకున్నారు పోలీసులు. ఆయనపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా… హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన తర్వాత విజయవాడకు వల్లభనేని వంశీని తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ? ఎందుకు విజయవాడకు తీసుకువెళ్లారు ? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో… తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు అయింది. అందుకే అతనిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.