మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో ట్విస్ట్ !

-

మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. పంజాగుట్ట కేసుతో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ పరిశీలిస్తున్నారు. అయితే, 2002లో జూబ్లీహిల్స్ లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన షకీల్ కార్…. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో కారులోనే షకీల్ కొడుకు రాహీల్ ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.

Ex MLA Shakeel Son case update

అప్పట్లో ఆఫ్నాన్ అనే వ్యక్తి తానే కారు నడిపినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు. కాగా ఆఫ్నాన్ పక్కనే రహీల్ కూర్చున్నట్టు గతంలో కోర్టుకు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ కేసులో గతంలో ఉన్న పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఫింగర్ ప్రింట్స్ ఆఫ్నాన్ తో మ్యాచ్ అయినట్టు కోర్టుకు తెలిపిన పోలీసులు వెల్లడించారు. కానీ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్, ఐడెంటిఫికేషన్ పేరేడ్ సరిగ్గా జరగలేదని ప్రస్తుత దర్యాప్తు అధికారుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version