ఆ ఎమ్మెల్యేకి ప్రత్యర్థి లేడు.. పోటీ చేసేందుకు జంకుతున్న టిడిపి నేతలు..

-

నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు.. దీంతో ప్రజలు వారికి జననీరాజనాలు పలుకుతున్నారు.. ఈసారి కూడా నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సిపి కవచనం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.. ముఖ్యంగా ఆత్మకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి జనాలతో మమేకమవుతున్నారు.. మేకపాటి కుటుంబం నుంచి వచ్చిన విక్రమ్ రెడ్డి.. నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామాన్ని టచ్ చేస్తున్నారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు.. దీంతో ఈసారి కూడా విక్రమ్ రెడ్డి గెలుపు ఖాయం అనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతుంది..

విక్రం రెడ్డి దెబ్బకి ఆత్మకూరులో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్థులు కరువయ్యారు.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన విక్రమ్ రెడ్డి.. ADF పేరుతో నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.. సీఎం జగన్ ఆశీస్సులతో రోడ్లు మౌలిక వసతులపై దృష్టి పెట్టారు.. ఈ క్రమంలో విజయి భవ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.. గ్రామాల్లో మండలాల్లో ఉన్న అసంతృప్త నేతలతో సమావేశమై.. పార్టీ బలోపేతం కోసం కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. మండలానికి ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేసి.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని వారికి భరోసా కల్పిస్తున్నారు.. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్య నేతలు సైతం విక్రమ్ రెడ్డి వైపు ఆకర్షితులవుతున్నారు..

విక్రమ్ రెడ్డి దూకుడును గమనించిన టిడిపి నేతలు ఆయన పైన పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.. సర్వేల్లో వస్తున్న నివేదికలను చూసి విక్రం రెడ్డి పై పోటీ చేయకపోవడమే మేలనే భావనలో ఉన్నారని టిడిపిలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంది.. నిన్న మొన్నటి వరకు ఆత్మకూరులో ఆనం పోటీ చేస్తారని ప్రచారం జరిగిన.. విక్రమ్ రెడ్డి జోరుని చూసిన అనం సైతం వెనకడుగు వేశారట.. దీంతో ఆత్మకూరులో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అనే ధీమాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version