మీరు ఎంత గగ్గోలు పెట్టినా పరీక్షలు వాయిదా వేయం – సీతక్క

-

మీరు ఎంత గగ్గోలు పెట్టినా పరీక్షలు వాయిదా వేయమని తెలిపారు మంత్రి సీతక్క. షెడ్యుల్ ప్ర‌కారమే అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని తెలిపారు మంత్రి సీతక్క. వాయిదా వేస్తే న్యాయ ప‌ర‌మైన, సాంకేతిక ప‌ర‌మైన చిక్కులు ఎదుర్కొక త‌ప్ప‌దు. వయో ప‌రిమితి దాటిపోయి ఉద్యోగాల‌కు అర్హులు కాకుండా పోతారు. అందుకే వారి ఆకాంక్ష‌ల మేర‌కు ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కొంత మంది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

Exams will not be postponed no matter how hard you try

రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాల దృష్టిలో పరీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొందని వివరించారు. అధికారం కోల్పోయి రాజ‌కీయ నిరుద్యోగులుగా మారిన కొంద‌రు, ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని నిరుద్యోగుల‌ను రెచ్చగొట్ట‌డం మానుకోవాలి. ఇప్ప‌డు మ‌ధ్య‌లో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జీవితాల‌తో ఆడుకోవ‌డం న్యాయం అనిపించుకోదు. ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతాయ‌ని భ్ర‌మ‌లు క‌ల్పించి నిరుద్యోగుల ఆశ‌ల‌పై నీల్లు చ‌ల్లొద్దని కోరారు మంత్రి సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news