తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి… బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక్కరే మంచి నేత, ప్రజల మనిషి అని తెలిపారు. ఆయన బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేయాలని సూచించారు. నేను హరీశ్‌తో మాట్లాడలేదు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలి.’ అని బండి పేర్కొన్నారు.
హరీష్‌రావు వివాదరహితుడు.. బీఆర్‌ఎస్‌లో హరీష్ రావు ఒక్కడే మంచి నాయకుడు అని కొనియాడారు బండి సంజయ్. హరీష్ రావు ప్రజల మనిషి… హరీష్ బీజేపీ లోకి వస్తే ఎమ్మెల్యే కు రాజీనామా చేసి రావాలన్నారు. హరీష్ రావు వివాద రహితుడు… ఆ పార్టీలో ఆయనొక్కడే మంచి నేత అన్నారు. బీజేపీ లో బిఅరెస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ ఒక డ్రామా అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ లోకి ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయాల్సిందేనన్నారు బండి సంజయ్.