టీఎస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పోలీస్ శాఖ చేతికే ఎక్సైజ్, ర‌వాణా నియామ‌కాలు..!

-

ఉద్యోగ నియామ‌కాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు రంగం సిద్ధ‌మైంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఉన్న టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఉన్న విషయం తెలిసిందే. కాగ టీఎస్ఎల్‌పీఆర్‌బీ కి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేసీఆర్ సర్కార్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ తో పాటు ఎక్సైజ్, ర‌వాణా శాఖ ఉద్యోగాల భ‌ర్తీని కూడా టీఎస్ఎల్‌పీఆర్‌బీ కి అప్ప‌గించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తుంది.

టీఎస్ఎల్‌పీఆర్‌బీ ప‌క‌డ్బందీగా ప‌రీక్షల‌ను నిర్వ‌హిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే పోలీసు, ఎక్సైజ్, ర‌వాణా శాఖల ఉద్యోగాలు ఒకే ర‌క‌మైన యూనిఫాం ఉండంటం తో పాటు ఈ మూడు శాఖ‌ల్లో ఎక్కువ ఉద్యోగాలు కానిస్టేబుల్ సంఖ్య‌నే ఎక్కువ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో పోలీస్, ర‌వాణా, ఎక్సైజ్ శాఖ ల‌ను టీఎస్ఎల్‌పీఆర్‌బీ చేత నియామించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. కాగ ఇటీవల ఆర్థిక శాఖ 30 వేల ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో 17,000 పోలీసు ఉద్యోగాలు, 212 ర‌వాణా శాఖ ఉద్యోగాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news