ముషీరాబాద్ స్క్రాప్ గోడౌన్ లో పేలుడు

-

హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఓ స్క్రాప్ గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ బాక్స్ కట్ చేస్తూ ఉండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి తీవ్ర విశమంగా ఉండడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయాల పాలైన వ్యక్తి నార్త్ ఇండియా కార్మికుడడు గౌసిద్దీన్ గా గుర్తించారు. గౌసుద్దీన్ కెమికల్ బాక్స్ కట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news