జనగామ చిచ్చు.. ముత్తిరెడ్డి కన్నీరు..పల్లాపై సంచలనం.!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే సి‌ఎం కే‌సిఆర్ అభ్యర్ధులని ప్రకటించాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీ అభ్యర్ధుల ఎంపిక 90 శాతం పూర్తి అయిందని, రెండు, మూడు రోజుల్లో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ సారి ప్రజా వ్యతిరేకత ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు కే‌సి‌ఆర్ సీటు ఇవ్వడం కష్టమని తేలింది.

ఇదే క్రమంలో జనగామ నుంచి బి‌ఆర్‌ఎస్ తరుపున రెండుసార్లు పోటీ చేసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈ సారి సీటు లేదని ప్రచారం జరుగుతుంది. ఆయన ప్లేస్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలో దింపుతారని తేలింది. ఇప్పటికే పల్లా సీటు తనకే అని, మద్ధతు ఇవ్వాలని బి‌ఆర్‌ఎస్ శ్రేణులని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకుంటూ..పల్లాపై ఫైర్ అయ్యారు.  తన కుటుంబంలో చిచ్చుపెట్టింది పల్లా రాజేశ్వర్ రెడ్డే అని, తన కూతురిని రోడ్డుపైకి తెచ్చింది పల్లానే అని ఆరోపించారు.

అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు జనగామలో సాగవని, ఆయన ఎంత ఎత్తు ఉన్నారో అన్ని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను డబ్బులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు ఎమ్మెల్సీగా పల్లా జనగామకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీటు తనకే అని ప్రచారం చేస్తూ..పల్లా బి‌ఆర్‌ఎస్ శ్రేణులని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇక కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా ఫస్ట్ లిస్ట్ సి‌ఎం కే‌సి‌ఆర్ తన పేరు ప్రకటించాలని ముత్తిరెడ్డి కోరారు.

అయితే ఈ సీటు దాదాపు ముత్తిరెడ్డికి కేటాయించడం జరిగే పని కాదని తెలుస్తోంది. పల్లాకు జనగామ సీటు ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పల్లాకే సీటు ఫిక్స్ అయితే ముత్తిరెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news