గిరిజన మహిళ పై దాడి చేస్తే సీఎం స్పందించడం లేదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఓ దారుణమైన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహిళ అర్థరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి దారుణంగా చితకబాదారు. దీనిపై ఇవాళ  బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఈటెల రాజేందర్ మీడియా తో  మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలు… సినిమా చూసేది BRS పార్టీ నేతలు అన్నారు. 

గిరిజన మహిళ పై దాడి చేస్తే సిఎం కేసీఆర్  ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ఈటల. బాధితులకు క్షమాపణ చెప్పాలని,   గిరిజన మహిళ పై దాడి విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్.   

Read more RELATED
Recommended to you

Latest news