సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్

-

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కు గుర్తు తెలియని ఆగంతకుడు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టారని ఫోన్ కాల్ రావడంతో వెంటనే మోండా మార్కెట్ పోలీసులు అప్రమత్తమై డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సహాయంతో ఆల్ఫా హోటల్ లో తనిఖీలు చేపట్టారు. హోటల్ కు సంబంధించిన షెటర్లు మూసేసి అందులో ఉన్న సిబ్బంది వినియోగదారులను బయటకు పంపి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ముగిసిన అనంతరం ఆగంతకుడు ఫేక్ కాల్ చేసి బెదిరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ కాల్ ఖమ్మం నుంచి గుర్తు తెలియని చేశాడని దర్యాప్తులో తేలింది.

‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టారని ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమయ్యాం. రాత్రి 10 గంటల 45 నిముషాలకు మాకు ఫోన్కాల్ వచ్చింది. వెంటనే బాంబ్ స్కాండ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టాం. తనిఖీల్లో బాంబు పెట్టిన దాఖలాలు కనిపించలేదు. దీంతో అది ఫేక్ కాల్గా నిర్ధారణ అయింది. ఫోన్కాల్ వచ్చింది ఖమ్మం నుంచి అని తేలింది. కానీ ఎవరు చేశారో ఇంకా తెలియాల్సి ఉంది. వీలైనంత త్వరగా అతణ్ని పట్టుకుంటాం’ అని డీసీపీ సుబ్బారాయుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news