హైదరాబాద్ లో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్ చల్..!

-

గ్రేటర్ హైదరాబాద్ లో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్ చల్ చేస్తున్నారు. ప్రముఖ హోటళ్లలో చెకింగ్ పేరుతో యజమానులను బెదిరిస్తున్నారు. కేసులు నమోదు చేస్తామని, హోటల్ సీజ్ చేస్తామంటూ బెదిరుస్తున్న వైనం చోటు చేసుకుంది. నిన్న రాత్రి గిస్మత్ మండీ హోటల్లో ఫుడ్ ఇన్స్ పెక్టర్లమంటూ తనిఖీలు చేసారు. అక్రమ సంపాదన కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా అవతారం ఎత్తారు ఇద్దరు మహిళలు. సిటీలో పెరిగిన ఫుడ్ తనిఖీల నేపథ్యంలో హడలిపోతున్నారు హోటల్ యజమానులు.

అయితే రైడ్ లో అందిన కాడికి దోచుకుంటున్నారు నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్లు. మరొక హోటల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి వచ్చామంటూ తనిఖీలు చేసారు. అయితే అనుమానంతో GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించారు హోటల్ యజమానులు. దాంతో ఆ మహిళలను వల వేసి పట్టుకున్నారు GHMC ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు. పేట్ బషీర్ పేట్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేసారు. అయితే ఆ మహిళల బాధిత హోటళ్ల జాబితాలో సికింద్రాబాద్ ఆల్ఫా , స్వాగత్ గ్రాండ్, కెప్టెన్ కుక్, పరివార్, కృతంగా హోటల్స్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news