ప్రజల అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని యథేచ్ఛగా నకిలీ బంగారంతో సమాన్యులను బురిడీ కొట్టిస్తున్న గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మార్కెట్ లో రేటు కంటే చాలా చౌకగా బంగారాన్ని అమ్ముతామంటూ ఓ గ్యాంగ్ ఇటీవల సీటీలో హల్చల్ చేసింది.
పథకం ప్రకారం.. పలువురి నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసి నకిలీ బంగారం వాళ్లకు అంటగట్టి ముఠా కనబడకుండా పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మేడిపల్లి పోలీసులు చాకచక్యంగా నలుగురు సభ్యులతో కూడిన గోల్డ్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ.51 లక్షల నగదు, 5 కిలోల మేర నకిలీ బంగారం అదేవిధంగా రూ.6 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.