తెలంగాణలో ఎలక్ట్రికల్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేసే మూడు క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా బ్యాటరీ కంపెనీ ‘గిగా’ పరిశ్రమకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ విచ్చేశారు.ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన ఆయన తయారీ రంగానికి సంబంధించిన యూనిట్స్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది ప్రధాని మోడీ ఆలోచన అన్నారు. తెలంగాణలో మూడు తయారీ రంగ క్లస్టర్స్కు కేంద్రం సహకారం అందిస్తోందని.. అందులో ఒకటి దివిటిపల్లిలో ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ కంపెనీకి నేడు భూమి పూజ జరుగుతుందని తెలిపారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని వెల్లడించారు.