‘తెలంగాణ రైతన్నకు.. మీ రేవంతన్న మాట’ – సీఎం రేవంత్ ట్వీట్

-

తెలంగాణ రైతన్నకు.. మీ రేవంతన్న మాట అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగాన్ని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం ‘రైతు రుణమాఫీ పథకం.’ రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Farmer Loan Waiver Guidelines

ఇది రైతన్నకు.. మీ రేవంతన్న మాట’ అంటూ ట్వీట్ చేశారు. నాడు శ్రీ మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా…నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా…ఎంత కష్టమైనా…ఎంత భారమైనా… ఏకకాలంలో రుణమాఫీ… చేసిన… చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో…రైతు సంక్షేమ కోణం ఉంటుంది…ఇది రైతన్నకు…మీ రేవంతన్న మాట అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version