పురుగుల మందు డబ్బాతో ప్రజావాణిలో రైతు నిరసన

-

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి వద్ద ఓ రైతు హల్ చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్లితే..  మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు పరుగులు మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. తన సమస్య పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

వెన్నల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్దన్ అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చాడు. కిష్టాపూర్ ఐకేపీ కేంద్రం ఆధ్వర్యంలో జనార్ధన్ తన మామిడి కాయలు అమ్మాడు. దీనికి సంబంధించి దాదాపు రూ.1.50 లక్షల వరకు రావాలి. కానీ నెల రోజుల నుంచి ఆయనకు అధికారులు డబ్బు చెల్లించడం లేదు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో ఆవేదన వ్యక్తం చెందిన జనార్ధన్ పురుగుల మందు డబ్బా పట్టుకుని వచ్చి నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news