వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ లో ఫార్మా కంపెనీ ఏర్పాటు పై గ్రామస్థుల అభిప్రాయ సేకరణ అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్, అధికారుల వాహనాల పై రాళ్ల దాడికి పాల్పడరు రైతులు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. దీంతో సంఘటన స్థలంలో పోలీసులను మొహరించారు.
అయితే కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారి వెంకట్ రెడ్డి పై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో దాడి చేసారు రైతులు, గ్రామస్తులు. సీఎం సొంత సెగ్మెంట్ లో కొన్ని రోజులుగా ఫార్మా కంపెనీ విషయంలో రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల గ్రామాల ప్రజలు. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వం అంటూ తెగేసి చెబుతున్నారు రైతులు.