వికారాబాద్ ఫార్మాసిటీ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్..!

-

వికారాబాద్ జిల్లా ఫార్మాసిటీ ఘటన పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గరీబి హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుండి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఎఎస్ లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు.

ఫార్మా సిటీ కోసం కెసీఆర్ గారు హైద్రాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు బెడుతున్నడు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైంది. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిన హరీష్ రావ్.. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని BRS పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version