గత ఏడు నెలలుగా టీడీపీ వాళ్ళు ఓట్ ఒన్ అకౌంట్ తోనే నడిపేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసే లాగా చంద్రబాబు పాలన ఉంది అని వైస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. రైతుకు సంవత్సరం కి 20వేలు ఇస్తామని ప్రకటించారు. అలా చేస్తే 10వేల కోట్లు కావాలి.. కానీ 5300 కోట్లు కేటాయించారు. కాపీ కొట్టడంలో ఉన్న చిత్తశుద్ధి పథకాల అమలులో లేదు. 82 లక్షల మందికి 10వేల కోట్లు పైనే అవసరం.. కానీ 5300 కోట్లు కేటాయించారు. కోటి 72 లక్షల మంది మహిళలు 18ఏళ్ళు నిండిన వారు ఉన్నారు. ఉచిత బస్సు ఎప్పడూ ఇస్తారు అని రెండున్నర కోట్ల మంది ఎంత కాలం ఎదురు చూడాలి.
రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. హామీల అమలు చేసే సామర్థ్యం లేదు కాబట్టి నేటి వరకు ఓట్ ఒన్ అకౌంట్ పేరుతో కాలక్షేపం చేశారు. జగన్ అధికారంలో ఉంటే అన్ని పథకాలు ఈపాటికె అమలు అయ్యేది. ఆరోగ్య శ్రీ అటకెక్కింది.. 108 మూలన పడింది. స్కూల్ లో నాడు నేడు మూలన పడేసారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని ప్రజల తరపున పోరాటం చేస్తాం అని ఎమ్మెల్సీ కల్యాణి పేర్కొన్నారు.