ఫాంహౌస్ పార్టీ.. DGP జితేందర్ కి కేసీఆర్ ఫోన్..!

-

జన్వాడ ఫాం హౌస్ పార్టీ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. రాజు పాకాల ఫామ్ హౌజ్ లో క్యాసినో నిర్వహించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాసినోకు సంబంధించిన కాయిన్స్ స్వాధీన పరుచుకున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున క్యాసినో నడిచినట్టు అధికారులు గుర్తించారు. నాలుగు సూట్ కేసుల్లో క్యాసినో మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు.

జన్వాడ ఫాం హౌస్ పార్టీ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. తాజాగా డీజీపీ జితెందర్ కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేందర్ ఇళ్లలో తనిఖీలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలను ఆపాలని డీజీపీని కోరారు మాజీ సీఎం కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version