రంగారెడ్డి జిల్లాలో లారీ భీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాాపారుల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది చిరు వ్యాపారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం 50 మందికి పైగా వ్యాపారులు రోడ్డు పై కూరగాయలు అమ్ముకుంటున్నట్టు సమాచారం.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాద ఘటన పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అంతేకాదు.. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాద జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని ఘటన స్థలంలోనే వదిలి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.