మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత విద్యా, వైద్యం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో వైద్యారోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్వతంత్ర భారతదేశంలో ఏడాదిలో 50వేల మంది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ఏ రాష్ట్రానికి కూడా లేదన్నారు. ఏడాది కాలంలో 50వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. కేవలం ఏడాది కాలంలో 7వేల 750 మంది నర్సులకు ఉద్యోగాలు భర్తీ చేసి నిమాయక పత్రాలను అందజేసామని తెలిపారు.
పరీక్షలు వాయిదా వేయాలంటూ కృతిమ ఉద్యమం తీసుకొచ్చారు. ఏడాదిలోనే 14వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గతంలో పరీక్షలుంటే ప్రశ్నాపత్రాలు జీరాక్స్ సెంటర్ల వద్ద లభించేవి. డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే.. రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు చేయించారు. ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అన్నారు. పదేళ్లుగా పరీక్షలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. రూ.83వేల కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు అందించామని తెలిపారు.