తెలంగాణలో ఈ మధ్య కాలంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్షణం ఆలోచించి ప్రయాణిస్తే.. నిండు నూరేళ్ల పాటు సంతోషంగా జీవిస్తారని.. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని రవాణా అధికారులు సూచించినప్పటికీ వాటిని ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా తూప్రాన్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా బైక్ ని ఢీ కొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది టిప్పర్. దీంతో ఒక్కసారిగా బైక్ లో చెలరేగాయి మంటలు. ఈ మంటల్లో కాసేపు కొట్టుమిట్టాడాడు బైకిస్టు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి మంటలు ఏర్పడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ దశరథ్ అనే వ్యక్తి.
రెండు కాళ్ళు కోల్పోయి చావు, బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. ప్రమాదంలో కాలి బూడిద అయింది బైక్. ఈ నెల 1న జరిగిన ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడంతో వైరల్ గా మారాయి.