కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్

-

కొండ గట్టు అంజన్నను మెగా హీరో వరుణ్ తేజ్ మంగళవారం దర్శించుకున్నారు. దీంతో ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ఫకుంభ స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలచ అర్చకులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటం అందజేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న చాలా మహిమగల దేవుడని, తొలిసారిగా హనుమాన్ దీక్ష తీసుకుని, స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మెగా హీరో వరుణ్ తేజ్ కి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. కొత్త సినిమా షూటింగ్ కి ఇంకా సమయ ఉండటంతో హనుమాన్ దీక్ష చేపట్టారు. రాబోయే సినిమాలతో సక్సెస్ బాట పట్టాలని అంజన్నను కోరుకుటున్నారు. గతంలో ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ వంటి సినియమాలతో మంచి హిట్లు అందుకున్న వరుణ్ కెరీర్ ప్రస్తుతం పడిపోయింది. ఆపరేషన్ వాలంటౌన్, గాండీవ దారి అర్జున, గని వంటి సిసిమాలలతో వరుస డిజాస్టర్లను దక్కించుకున్నారడు. ఇటీవల విడుదలైన మట్కా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news