తెలంగాణలో విషాదం.. డ్రైనేజీలో పడి మహిళా కానిస్టేబుల్ మృతి

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీలో పడి మహిళా కానిస్టేబుల్ మృతి చెందింది. ఈ సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రూపన శ్రీదేవి(49) డ్రైనేజీలో జారిపడి మరణించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిన్న భద్రాచలం బందోబస్తుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

Female constable dies after falling into drainage
Female constable dies after falling into drainage

మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో నీటి ప్రవాహం వల్ల డ్రైనేజీ పొంగి పొర్లింది. నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె డ్రైన్ లో పడి చనిపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదం ఎలా చోటు చేసుకుంది.. దీనికి కారణాలు ఏంటని ఆరా తీసుకున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.