హైదరాబాద్ డ్రగ్స్‌ కేసు.. నిందితుల సెల్‌ఫోన్లలో సినీ ప్రముఖుల నంబర్లు

-

మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేయడం, రేవ్‌ పార్టీలకు సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానించడం, మత్తుపదార్థాలు ఎరవేసి అమ్మాయిలను రప్పించడం, ప్రముఖుల పరిచయాలను అడ్డుపెట్టుకొని సినీ నిర్మాతలుగా అవతారమెత్తారని నిందితుల విచారణలో తేలింది.

మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులు బాలాజీ, రాంకిశోర్‌, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్‌ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన టీఎస్‌న్యాబ్‌ .. సినీ నిర్మాతలు రవి ఉప్పలపాటి, వెంకటరత్నారెడ్డిలకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ, విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్‌ ద్వారా డ్రగ్స్‌ చేరేవని గుర్తించిందినట్లు సమాచారం.

బెంగళూరులోని నైజీరియన్లతో బాలాజీకి పరిచయాలున్నాయని.. అక్కడి నుంచి కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకొచ్చేందుకు రాంకిశోర్‌ సహకరించేవాడని.. కొకైన్‌ను బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ సినీ, రాజకీయ ప్రముఖులకు విక్రయించేవారని పోలీసులు గుర్తించారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలోని అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని పార్టీలు నిర్వహించేవారని.. మోడళ్లు, సినీ అవకాశాల కోసం ఎదురుచూసే యువతులకు కొకైన్‌ ఎరవేసి రప్పించేవారని పోలీసులు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news