తెలంగాణలో ఓటు హక్కు కోసం కొత్తగా 13.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. మరో 7.77 లక్షల మంది వివరాల సవరణకు దరఖాస్తు చేసుకున్నారని, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు తొలగించాలని 6.26 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఓటరు జాబితా సవరణకు దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. కాగా.. వచ్చే నెల 3న కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాక త్వరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా ఏర్పాట్లను పరిశీలించేందుకు 17 మందితో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్ నగరానికి రానుంది. వచ్చేనెల 3 నుంచి 5వ తేదీ వరకు విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి పంపింది.