ఎంబీసీ, బీసీలకు ఆర్ధిక సాయంపై నేడు ప్రకటన

-

రాష్ట్రంలో కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీలకు ఆర్థిక సాయం అందించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. వీలైనంత త్వరగా వారికి ఆర్థిక సాయం చేసేందుకు కసరత్తు షురూ చేసింది. ఇందులో భాగంగా ఎంబీసీ, బీసీల నుంచి దాదాపు లక్షన్నర మందికి ఆర్థిక సహాయంపై ప్రభుత్వం నేడు విధివిధానాలు ప్రకటించనుంది. ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది.

ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలివిడత పథకాన్ని ప్రకటించనుంది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సహాయం తదితర విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమావేశమై, సీఎం సమక్షంలో తుదివిధానాలు ప్రకటించనుంది. నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల వర్గాలతో పాటు.. మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘం ఆయా వివరాలను వెల్లడించనుంది. అర్హులైన కులవృత్తులు చేసుకుంటున్న కుటుంబాల నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు తీసుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంపిణీ చేయనుంది. జూన్‌ 9న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news