తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనాలకు మించి.. నిర్ణయాలు తీసుకోవడంతో… పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి. అయితే.. తాజాగా ఆర్థిక భారం ఎక్కువగా పడేలా చేసింది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. నారాయణపేట – కొడంగల్ లిప్ట్‌తో ఆర్ధిక భారంగా మారనుందట. లిఫ్ట్ అంచనా వ్యయం రూ. 3117 కోట్ల నుండి రూ. 4350 కోట్లకు పెంచారట.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగు నీటిని అందించాలన్న ప్రతిపాదనలున్న వాటిని పక్కన పెట్టి నారాయణపేట – కొడంగల్ లిప్ట్‌ను ముందుకు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. తొలుత నిర్మించిన సొరంగ నిర్మాణాలు కాదని, కొత్తగా ప్రెషర్ మెయిన్స్ ప్రతిపాదించడంతో రూ. 53 కోట్ల వ్యయం పెరగగా, ఏటా మైంటేనన్స్ ఛార్జీలు అధికంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో భారీగా పెరిగిందట నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ బడ్జెట్.