వైసీపీకి నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా

-

వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వై.సి.పి.కి రాజీనామా చేశారు నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్. రూరల్ ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వెల్లడించారు నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్. శ్రీధర్ రెడ్డి వల్లే మేయర్ పదవి వచ్చిందని… అధికార పార్టీ బెదిరింపుల వల్లే అప్పుడు పార్టీని వీడామని వెల్లడించారు.

Nellore Mayor Sravanti resigns from YCP

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డీ ఇచ్చారని వివరించారు. అంతేగాక మేయర్ ను చేశారని.. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారని… శ్రీధర్ రెడ్డి వై.సి.పి.ని వీడినప్పుడు కూడా ఆయసతోనే ఉంటానని స్పష్టం చేశామన్నారు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వై.సీ.పి.లోకి వెళ్ళాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news