Hyd: ఆయిల్ కంపెనీలో పేలుడు.. ఎగిసిపడిన మంటలు

-

Hyd: ఆయిల్ కంపెనీలో పేలుడు సంభవించింది..దింతో మంటలు ఎగిసిపడ్తున్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం రామేశ్వరం శివారు అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలడంతో నిన్న రాత్రి 11 గంటలకు చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం.

Fire accident at BRS Oil Company in Annaram village, Rameshwaram suburb, Shadnagar constituency, Farooq Nagar mandal

ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పని చేస్తున్న 30 మంది కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం అందుతోంది. ఇక షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం రామేశ్వరం శివారు అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version