తొలి ఎన్నికలోనే గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతోంది వీళ్లే

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఈసారి చాలా ఆసక్తికర విజయాలు నమోదయ్యాయి. ఓవైపు కాంగ్రెస్ 65 (64 +1 సీపీఐ) స్థానాలు గెలుచుకోగా మరోవైపు ఈ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అలా ఈ ఎన్నికల్లో తొలి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోయే నేతలెవరో తెలుసుకుందామా..?

  • కుందూరు జైవీర్‌రెడ్డి (48), కాంగ్రెస్ అగ్రనేత జానారెడ్డి కుమారుడు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి నాగార్జునసాగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే భగత్‌ (బీఆర్ఎస్)పై గెలిచారు.
  • కల్వకుంట్ల సంజయ్‌(47), స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌(బీఆర్ఎస్) కోరుట్లలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(బీజేపీ)పై గెలిచారు.
  • వెడ్మా బొజ్జు (37), నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెడ్మా బొజ్జుపటేల్‌ గెలుపొందారు.
  • మైనంపల్లి రోహిత్‌రావు (26), మైనంపల్లి హన్మంతరావు తనయుడు, వైద్యుడైన రోహిత్‌(కాంగ్రెస్‌).. మెదక్‌లో అప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్‌రెడ్డి(బీఆర్ఎస్)పై సంచలన విజయం సాధించారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో మహిళలు రాణించారు. ఏకంగా ముగ్గురు యువతులు ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి విజయఢంకా మోగిచారు. మరి వారెవరో ఓ లుక్కేద్దామా..?

  • చిట్టెం పర్ణికారెడ్డి (30), నారాయణపేట నుంచి రేడియాలజిస్ట్‌ చిట్టెం పర్ణికారెడ్డి(కాంగ్రెస్‌) వరుసగా రెండుసార్లు గెలిచిన రాజేందర్‌రెడ్డి(బీఆర్ఎస్)పై విజయం సాధించారు.
  • యశస్వినిరెడ్డి (26), పాలకుర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మామిడాల యశస్వినిరెడ్డి బరిలో నిలిచి, ఎమ్మెల్యేగా డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఓడించారు.
  • లాస్య నందిత (38), దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె అయిన నందిత కంటోన్మెంట్‌ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version