తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఎండలు కొడుతున్న సన్నతి తెలిసిందే. రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. అటు వడదాలను విపరీతంగా వస్తున్నాయి.

దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ ఎండ తీవ్రత నేపథ్యంలో నిన్ను ఒక్కరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మరణించారు. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండగా… 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 దాటిన తర్వాత అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వెంట గొడులు, క్యాప్ లేదా స్కార్ఫ్ వంటివి ధరించాలని.. వాటర్ బాటిల్ తప్పకుండా వెంట ఉండాల్సిందేనని సూచించారు.
