భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఫిక్స్

-

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 24 వరకు వసంతపక్షపయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 17న జరగనుండగా, మరసటి రోజు ఏప్రిల్ 18న సీతారాముల పట్టాభిషేకం మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

అయితే ప్రధానంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారు అయింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందించనున్నారు. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని ఈసారి ప్రత్యక్ష ప్రసారం  చేయడం లేదు. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకీ ఓ లేఖ కూడా రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news