చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

-

సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ. సీఐడీ తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు కొనసాగించారు. అయితే, బెయిల్ షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని సీఐడీ పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వస్తుంది, అధికారుల లిస్ట్ మా వద్ద ఉందని నారా లోకేష్ అధికారులను బెదిరించారని.. లోకేష్ కొన్ని టీవీ చానల్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే మాట్లాడారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బెయిల్ వచ్చింది చంద్రబాబుకు అయితే.. కొడుకు మాట్లాడితే ఉల్లంఘన ఎలా అవుతుంది అని వాదించారు సిద్ధార్థ్ లూత్రా. ఈ కేసు విచారణ జస్టిన్ బేలా ఎం త్రివేది, జస్టిన్ పంకజ్ మిఠల్ బెంచ్ ముందు సాగింది. అయితే, బెయిల్ షరతులు ఉల్లంగించవద్దని ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై అభియోగాలు మోపిన సీఐడీ.. ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆయన 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో గడిపారు. ఆ తర్వాత చంద్రబాబుకు మొదట ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. కొన్ని రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసిన విషయం విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news