నేడు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలవడం చేర్చనీయాంశంగా మారింది. ‘తెలంగాణ పుట్టుకను పదేపదే అవమానించిన ప్రధానికి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు’ అంటూ పోస్టర్లను అతికించారు. ప్రధాని పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడిన మాటలను అందులో లెక్కించారు.
అలాగే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా మరికొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. మోడీ తెలంగాణకు ఇచ్చిన పది హామీలను నెరవేర్చలేదంటూ ఆయనను రావణాసురుడితో పోల్చారు. ITIR, టెక్స్టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మిషన్ భగీరథ ఫండ్స్, బయ్యారం స్టీల్ ప్లాంట్, పసుపు బోర్డు, మెడికల్ కాలేజీ, IIM ఏమయ్యాయని ఆ ఫ్లెక్సీలో ప్రశ్నించారు.
ఇటు హైదరాబాదులో సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆ పోస్టర్లలో బీఆర్ఎస్ అంటే డీల్ అని, తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెల్యేల కొనుగోలుదారు అని రాసి ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్ డీల్ ని పోలిన లోగోతో బిఆర్ఎస్ డీల్, ఓఎల్ఎక్స్ లోగోను పోలిన సోల్డ్ ఎక్స్ అని అందులో రాసకోచ్చారు. ఈరోజు ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో… మోడీకి వ్యతిరేకంగా కూడా పోస్టర్లు వెలిశాయి.